HCL TechBee: ఇంటర్‌తో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు.. మీ పేర్లు కూడా రిజిస్టర్‌ చేసుకోండి | hcl tech bee 2021 hcl tech bee early career program for it roles registration application at hcltechbee com


ఇంటర్మీడియెట్‌ అర్హతతో ఐటీ కెరీర్‌ను ప్రారంభించేందుకు హెచ్‌సీఎల్‌ అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం ‘టెక్‌ బి’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నవారితో పాటు గత రెండేళ్లలో ఇంటర్‌ పాస్‌ అయిన వారు దీనికి అర్హులు. ఆసక్తి ఉన్నవారు ‘హెచ్‌సీఎల్‌ టెక్‌ బి’ కార్యక్రమం కింద పేర్లు నమోదు చేసుకోవాలి.
అసలు ఉద్దేశం:
సాఫ్ట్‌వేర్‌ రంగంలో ప్రముఖ ఎమ్‌ఎన్‌సీ సంస్థల్లో ఒకటైన హెచ్‌సీఎల్ స్థానికులకు ఒక పరిష్కారం చూపుతోంది. దేశంలో వివిధ ప్రాంతాల్లోని ఐటీ ఉద్యోగులు ఏపీలోనే ఉద్యోగాలు చేసుకునేలా ‘కమ్ బ్యాక్ హోమ్’ కార్యక్రమాన్ని చేపట్టింది. 2017 నుంచి సంస్థ దీన్ని మొదలుపెట్టింది. ఇక నుంచి ఈ కార్య‌క్ర‌మాన్ని విజయవాడలోని తమ క్యాంపస్ పరిధిలో మరింతగా అమలు చేయనున్నారు.

విద్యార్థులు, అనుభవజ్ఞులైన ఐటీ ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే సొంత రాష్ట్రంలోనే ఉండి ఉపాధి పొందవచ్చు. హెచ్‌సీఎల్ సంస్థ ఏపీ ప్రభుత్వ సహకారంతో ఇక్కడే నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని కూడా నిర్వహిస్తోంది. దీంతో ఉద్యోగులు, యువత ఊరికి, బంధువులకు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సిన పనిలేదు. ఊరికి దగ్గర్లోనే ప్రముఖ సంస్థలో ఉద్యోగం చేయొచ్చు.
ఇంటర్ విద్యార్థులకు:
ఇంటర్మీడియట్ అర్హతతోనే ఐటీ రంగంలో స్థిరపడాలనుకునే ఇది మంచి అవకాశం. దీనికి ప్రస్తుతం ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వారితో పాటు గత రెండేళ్లలో ఇంటర్ ఉత్తీర్ణులై విద్యార్థులు అర్హులు. ఆసక్తి కలిగిన వారు హెచ్‌సీఎల్‌ ‘టెక్ బి’ కార్యక్రమం కింద పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

ఏడాది పాటు శిక్షణ:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏడాది పాటు శిక్షణ ఇచ్చిన తర్వాత ఉద్యోగావకాశం కల్పిస్తారు. ఇందుకు శిక్షణ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు ఉద్యోగంలో చేరిన తర్వాత బిట్స్ పిలానీ, శాస్త్ర విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు సహకారం అందిస్తారు.

HCL TechBee: ఇంటర్‌తో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు.. మీ పేర్లు కూడా రిజిస్టర్‌ చేసుకోండి | hcl tech bee 2021 hcl tech bee early career program for it roles registration application at hcltechbee com HCL TechBee: ఇంటర్‌తో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు.. మీ పేర్లు కూడా రిజిస్టర్‌ చేసుకోండి | hcl tech bee 2021 hcl tech bee early career program for it roles registration application at hcltechbee com Reviewed by Telugu Tek Talk on January 31, 2021 Rating: 5

No comments:

Powered by Blogger.